ముంబయి వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సంచలనం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు.
ఓవర్‌నైట్ స్కోరు 221/4తో రెండో రోజు ఆట ప్రారంభించింది టీమ్ఇండియా. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(150) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అయితే ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ టీమ్‌ఇండియాను దెబ్బతీశాడు. ఒకే ఓవర్‌లో సాహా(27), రవిచంద్రన్ అశ్విన్ (0)లను పెవిలియన్ పంపాడు. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన మయాంక్, అక్షర్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు.
అయితే రెండో సెషన్లో మయాంక్ అగర్వాల్‌ను(150) అడ్డుకున్నాడు అజాజ్ పటేల్. దీంతో 291 స్కోరు వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది టీమ్ఇండియా. అక్షర్‌తో(34) కలిసి మయాంక్ 67 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా 100 ఓవర్లకు 291/7స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన అక్షర్ పటేల్(52) కూడా అజాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత జయంత్ యాదవ్(12), ఉమేశ్ కూడా తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. దీంతో 325 రన్స్‌కు ఆలౌటైంది కోహ్లీసేన.