టీమ్​ఇండియా క్రికెటర్ కు షాక్..!

Shock to Team India cricketer ..!

0
81

టీ20 ప్రపంచకప్ పూర్తి చేసుకుని దుబాయ్​ నుంచి స్వదేశానికి చేరుకున్న టీమ్​ఇండియా క్రికెట్​ హార్దిక్​ పాండ్యాకు ఊహించని షాక్​ తగిలింది. అతడి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే ఖరీదైన వాచ్​లను కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఐపీఎల్​, టీ20 ప్రపంచకప్ కోసం దుబాయ్​ వెళ్లాడు హార్దిక్​ పాండ్య. దాదాపు మూడు నెలల పాటు టీమ్​ఇండియా జట్టు అక్కడే ఉంది. ఇటీవల పొట్టి ప్రపంచకప్​ పూర్తయిన నేపథ్యంలో ఆటగాళ్లు అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన హార్దిక్​ వద్ద ఖరీదైన వాచీలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారాన్ని ఖండించాడు హార్దిక్‌. దుబాయ్‌ నుంచి చట్టబద్ధంగానే వాచ్‌లు కొన్నానని హార్దిక్‌ పాండ్యా ట్వీట్‌ చేశాడు. దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన వస్తువులపై పన్నులు చెల్లించా. కస్టమ్స్‌ అధికారులు అడిగిన అన్ని పత్రాలు సమర్పించా. కస్టమ్స్‌ అధికారులు లెక్కగట్టిన పన్ను మొత్తాన్ని చెల్లించా అని తెలిపాడు.