తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్‌పై తమన్న ఫిర్యాదు చేశారు. తమన్న అంటే హీరోయిన్ కాదు . ఈ తమన్న వేరు.చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చాలా సినిమాల్లో నటించారు కానీ తెలుగునాట ఆయన నటకనకి వచ్చిన గుర్తింపు అంతంతమాత్రమే. ఐతే ఇటీవల ఆయన పార్లమెంట్ ముందు వేసిన వేషాలతో జాతీయస్థాయిలో ఒక ప్రచారం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కి మోదీ బావ..అన్యాయం చేశాడంటూ ఆయన మాడా గెటప్‌లో కనిపించడం కలకలం రేపింది.
ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్బంగా రోజుకో రకం గెటప్‌తో దర్శమిచ్చారు. ఐతే మాడాలా చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు అంటూ ఆయన కనిపించడం విమర్శలకి దారితీసింది. తాజాగా తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హుందాగా బతుకుతున్న తమను ఎంపీ అవమానించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తమన్న సింహాద్రి