కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన టీడీపీ

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన టీడీపీ

0
123

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. లోక్ సభ సెక్రటరీ జనరల్ కు టీడీపీ ఎంపీ కేశినేని అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు.

రాష్ట్ర విభజన హామీలను సాధించుకునే క్రమంలో, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చామని మీడియాతో మాట్లాడుతూ కేశినేని నాని తెలిపారు. అవిశ్వాసానికి 150 మంది ఎంపీల మద్దతును కూడగడతామని చెప్పారు.

బీజేపీకి దమ్ముంటే అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధమవ్వాలని సవాల్ విసిరారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా ఉండేందుకు గత పార్లమెంటు సమావేశాలను బీజేపీ పక్కదోవ పట్టించిందని మండిపడ్డారు.