నేలపై కూర్చుని తినడం వల్ల ఈ సమస్యలు రావట..

0
119

ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనవిధానంతో నేలమీద కూర్చొని తినే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ నేలమీద కూర్చొని తినడం వల్ల లాభాలు ఒక్కసారి తెలిస్తే మళ్ళి జీవితంలో కుర్చీల్లో, బెడ్‌పై, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినడానికి ఇష్టపడరు. నేలపై కూర్చొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌ మెరుగుపడడంతో పాటు..జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావాలంటే రోజు కింద కూర్చుని తినడం మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు పైసలు ఖర్చు చేసి వివిధ రకాల మందులు వాడడం కన్నా రోజు నేలపై కూర్చుని తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

ఇంకా నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే శ‌రీరంలో రక్తం అన్ని భాగాలకు స‌ర‌ఫ‌రాకావడమే కాకుండా.. మనస్సు కూడా ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి బీపీ వంటి సమస్యలను కూడా తగ్గిచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వెన్నెముక స‌మ‌స్య‌లను  కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నేలమీద కూర్చుని తినడం అలవాటు చేసుకోండి.