అంతర్జాతీయ క్రికెట్ కి యువి రిటైర్మెంట్..!!

అంతర్జాతీయ క్రికెట్ కి యువి రిటైర్మెంట్..!!

0
77

క్రికెట్ కోసం తన రక్తం, స్వేదం ధార పోశానని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో యూవీ మాట్లాడుతూ, ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. తన జీవితంలో తనపై తాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదని, క్రికెట్ తనకు ఆడడం, పోరాడటం, పడటం, లేవటం, ముందుకు సాగడం నేర్పిందని చెప్పారు.

ఇకపై కేన్సర్ బాధితులకు అండగా ఉండటమే తన తదుపరి లక్ష్యమని అన్నారు. కాగా, 2011 ప్రపంచ కప్ సమయంలో యూవీ కేన్సర్ బారిన పడ్డాడు. ఈ ప్రపంచకప్ అనంతరం కేన్సర్ చికిత్స తీసుకున్నాడు. కేన్సర్ నుంచి కోలుకున్నాక యూవీ ఆటలో వెనుకబడిపోయాడు.