Alltimereport, Desk: తన తల్లి సోనియా గాంధీ భయపటం, వెనకడుగు వేయడం తాను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) వెల్లడించారు. ఆమె ఇప్పటికి నాలుగు సార్లు క్యాన్సర్‌తో పోరాడి జయించారని చెప్పారు. సోనియా జీవిత చరిత్ర ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ నుంచి కష్టాల వరకు అన్ని షేర్ చేసుకున్నారు. తన తల్లిదండ్రులు రాజీవ్, సోనియా కేంబ్రిడ్జ్‌లోని వర్సిటీ రెస్టారెంట్‌లో తొలిసారి కలిశారని రాహుల్ గుర్తు చేసుకున్నారు. తాను చదువుకునే రోజుల్లో అప్పటి ప్రేయసితో కలిసి అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. తన తల్లిదండ్రుల పరిచయం గురించి చెప్పగానే సిబ్బంది వారిని గుర్తుపట్టారని తెలిపారు. ఆ ప్రేయసి గురించి అడిగితే.. ఇప్పుడు ఆమె తనకు స్నేహితురాలని సరదాగా సమాధానమిచ్చారు.
మారు పేరుతో చదువు: సోనియా
ఈ కార్యక్రమంలో 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను సోనియా గుర్తు చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత రాహుల్ (Rahul Gandhi) విదేశాల్లో చదువుకు వెళ్లారని చెప్పారు. భద్రతా కారణాలతో హార్వర్డ్‌లో ప్రత్యేక ఏర్పాట్లకు అనుమతి లభించకపోవడంతో మరో అమెరికన్ కాలేజీకి మార్చినట్లు వెల్లడించారు. రాహుల్‌ను మరో కాలేజీలో వేరే పేరుతో చదివించామని సోనియా తెలిపారు. ఇతర విద్యార్థులకు ఆయన అసలు గుర్తింపు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. కుటుంబం గురించి మాట్లాడలేని పరిస్థితి వల్ల స్నేహాలు చేసుకోవడం కూడా రాహుల్‌కు కష్టమై ఉండొచ్చని పేర్కొన్నారు.
Also Read : ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి
Follow Us On: Whatsapp


