ది వన్ 2 ప్ ప్రోమోకు విమర్శల సెగ!

-

Alltimereport, Desk : తమన్నా(Tamannaah Bhatia), సిద్దార్థ్ మల్హోత్రా జోడీగా నటిస్తున్న ‘ది వన్2(The Vvaan 2)’ ప్రోమో రిలీజ్ అయింది. అయితే అనూహ్యంగా ఈ ప్రోమోకు ప్రేక్షకుల ఆదరణకు బదులు విమర్శల సెగ తగిలుతోంది. ‘ది వన్’ హిట్ కావడంతో నిర్మాత ఏక్తా కపూర్ నవంబర్ 16న ఛఠ్ పూజ సందర్భంగా ‘వ్వాన్ 2’ను ప్రకటించారు. సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ సీక్వెల్‌పై ఆసక్తి మొదలైంది. ‘ది వన్’ సెప్టెంబర్ 25న విడుదలైంది. భారతీయ జానపద కథలు, సంప్రదాయ విశ్వాసాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. దీంతో సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్ తీయాలని టీమ్ భావించింది.

- Advertisement -

కానీ ఇప్పుడు సీక్వెల్ ప్రకటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. భారతీయ జానపద కథలకు పెద్ద తెరపై మరింత ప్రాధాన్యం దక్కాలని కొందరు స్వాగతించారు. మరికొందరు మాత్రం మొదటి భాగం కంటే రెండో భాగం కథ, తెరకెక్కించే విధానం మెరుగ్గా ఉండాలని సూచించారు. సిద్ధార్థ్(Sidharth Malhotra), తమన్నానే మళ్లీ నటించాలని అభిమానులు కోరుతున్నారు. అయితే ప్రకటన వీడియోపై విమర్శలు కూడా వచ్చాయి. ఏఐతో రూపొందించిన వీడియోలా ఉందని, ప్రచారంలో మరింత శ్రద్ధ చూపాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. సీక్వెల్స్ పేరుతో సినిమాలను కొనసాగించే ధోరణిపైనా మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి దీనిపై మూవీ (The Vvaan 2) టీమ్ క్లారిటీ ఇస్తుందా? లేదంటే అతి త్వరలో ఇంకా మంచి క్వాలిటీతో ఒరిజినల్‌గా అనిపించే మరో క్లిప్‌ను రిలీజ్ చేస్తుందో చూడాలి.

Also Read : సోనియా భయపడటం నేను చూడలేదు: రాహుల్..

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘ఆకాశంలో ఒక తార’ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ అంటే..!

Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా...

సోనియా భయపడటం నేను చూడలేదు: రాహుల్..

Alltimereport, Desk:  తన తల్లి సోనియా గాంధీ భయపటం, వెనకడుగు వేయడం...