సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

-

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి వెల్లింగ్‌టన్‌లో తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌పై వెటరన్ ప్లేయర్ గవాస్కర్ (Sunil Gavaskar) అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. 15మంది స్క్వాడ్‌లో ఉన్న సిరాజ్‌(Mohammed Siraj)కు ప్లేయింగ్ 11లో ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు. సిరాజ్ బౌలింగ్‌లో లోపాలేమీ కనిపించడం లేదని, అతడు ఎప్పుడూ భారత్‌ను నిరాశపరచలేదని అన్నారు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణకు చోటు కల్పించింది. సిరాజ్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు.

- Advertisement -

ఈ నిర్ణయంపై మ్యాచ్‌కు ముందు సోనీ స్పోర్ట్స్ చర్చలో గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించారు. ఇటీవల సిరాజ్ బౌలింగ్‌లో మంచి రిథమ్ కనిపించిందని, అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదని అన్నారు. అతడి స్థానంలో ఎంపికైన బౌలర్లు రాణించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరీస్ కాంబోజ్ ఎంపికను సమర్థించారు. అతడి వేగం, కచ్చితత్వం, స్వింగ్ చేయగల సామర్థ్యం ఈ పిచ్‌పై ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. పచ్చికతో ఉన్న పిచ్‌పై కాంబోజ్ మంచి ఎంపిక కావచ్చని పేర్కొన్నారు.

Also Read : ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...

తెల్లటి పళ్లా.. బలమైన పళ్లా? టూత్‌పేస్ట్‌తో ఏది సాధ్యం?

Alltimereport : తెల్లటి పళ్లు.. ప్రతి ఒక్కరి కల. చాలా మంది...