Alltimerepot : ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్. చుక్కా రామయ్య (Chukka Ramaiah) వందేళ్లు పూర్తి చేసుకుని నేడు 101వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు రాజకీయనాయకులు, విద్యావేత్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలువురు ప్రముఖులు ఆయనను స్వయంగా కలిసి సత్కరించారు.
అయితే, ఇదే సమయంలో చుక్కా రామయ్యకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక ప్రసంగంలో సీఎం చంద్రబాబు నాయుడు, చుక్కా రామయ్యతో తనకి ఎదురైన అనుభవాన్ని పంచుకున్న వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
“చుక్కా రామయ్య (Chukka Ramaiah) ఒక బ్యాగ్ వేసుకుని తిరుగుతుంటాడు. చూస్తే ఈయనేనా అనిపిస్తుంది. కానీ ఒక టెస్ట్ పెడతాడు. 10 వేల మంది అటెండ్ అయితే 100 మందిని సెలెక్ట్ చేస్తాడు. నా దగ్గరకి చాలామంది వచ్చి ఆయన ఇన్స్టిట్యూట్ లో సీటు ఇప్పించమని అడుగుతుండేవాళ్లు. నేను ఆయనకు కాల్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ, సీటు మాత్రం ఇవ్వను అని చెప్పేవాడు. దీంతో ఆయన మీద గౌరవం పెరిగింది” అని చంద్రబాబు వెల్లడించారు.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్.. పేరు, ఎప్పుడు పుట్టాడో చెప్పేసింది
Follow Us on: Whatsapp


