మైసా’లో రాములమ్మ గర్జన!

-

Alltimereport : 1997లో సంచలనం సృష్టించిన ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ పాట (Osey Ramulamma Song) మరోసారి తెరపైకి వచ్చింది. రష్మిక నటిస్తున్న ‘మైసా (Mysaa)’ కోసం ఈ పాటను కొత్తగా రీక్రియేట్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ కలయికలో వచ్చిన ఈ గీతాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘మైసా’ ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. ఇందులో రష్మిక (Rashmika Mandanna) టైటిల్ పాత్ర పోషిస్తుండగా, సముద్రఖని, రావు రమేశ్, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

పాట విడుదల సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘ఒసేయ్ రాములమ్మ’ ఒక చరిత్ర సృష్టించిన సినిమా అని, దాని ఐకానిక్ పాటను మళ్లీ రూపొందించడం పెద్ద బాధ్యతగా భావించామని తెలిపింది. ఒరిజినల్ పాటను పూర్తిగా మ్యాచ్ చేయలేకపోయినా, దానికి న్యాయం చేసేలా ప్రయత్నించామని పేర్కొంది. కొత్త పాటకు కూడా ప్రేక్షకులు అదే ప్రేమను అందించాలని కోరింది. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, ‘మైసా(Mysaa)’ గర్జన ఇప్పటికే వినిపించిందని, ఈ నెల 27న థియేటర్లలో ఆ సింహం కనిపించబోతోందని అన్నారు.

Also Read : ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం

Alltimereport : టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం రేగింది. కొత్తగా...

భారత్‌ను చూసి నేర్చుకోండి.. సెంట్రల్ బ్యాంక్‌కు ట్రంప్ క్లాస్

Alltimereport : అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్...