Alltimereport : కెనడాలో భారత సంతతి జంట దారుణ హత్యకు (Indian-Origin Couple Case) గురైంది. టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్రేలోని వాల్‌మార్ట్ బయట దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కేసు దర్యాప్తును కెనడా అతిపెద్ద హత్యల విభాగం ఐహెచ్ఐటీ స్వీకరించింది. అక్టోబర్ 29న లాంగ్లీ ప్రాంతంలో ఓ కారు దగ్ధమైంది. అందులో 25 ఏళ్ల తుషార్ శర్మ మృతదేహం కనిపించింది. అతడిని ఉద్దేశపూర్వకంగానే చంపి ఉంటారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరువకముందే నవంబర్ 15 రాత్రి సర్రేలో మరో దారుణం జరిగింది. వాల్‌మార్ట్ పార్కింగ్‌లో బుల్లెట్ గాయాలతో ఉన్న 23 ఏళ్ల గగన్‌ప్రీత్ రెహాల్, 24 ఏళ్ల సుఖ్జీత్ కౌర్‌ను పోలీసులు గుర్తించారు. డెల్టాలో నివసించే వీరిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అక్కడ అద్దాలు పగిలిన ఎరుపు రంగు మస్టాంగ్ కారు కనిపించింది. కాల్పులు జరిగిన 13 నిమిషాల తర్వాత సమీపంలో మరో కారు కాలిపోయింది. నిందితులు ఆ కారులోనే వచ్చి దానికి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెహాల్పై గతంలో ఆయుధాల కేసులు (Indian-Origin Couple Case) ఉన్నాయని, కౌర్‌కు కెనడాలో పెద్దగా పరిచయాలు లేవని తెలిసింది. ఇది నేర ముఠాల పని అని, పక్కా ప్లాన్‌తోనే కాల్పులు జరిపారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. రెండు కుటుంబాలు తమ వారిని కోల్పోయి విషాదంలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సీసీటీవీ లేదా డ్యాష్ క్యామ్ ఆధారాలుంటే ఇవ్వాలని ప్రజలను కోరారు.
Also Read : భారత్ ఎదుగుదలకు చైనా అడ్డంకులు.. అమెరికా హెచ్చరిక!
Follow Us On: Whatsapp


