ట్రంప్‌కు కిమ్ నో రెస్పాన్స్.. ఫోన్ చేసినా..

-

Alltimereport : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌(Kim Jong Un)తో చర్చలకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. అందుకు చర్చల్లో అంశాలు కారణం కాదు. కిమ్ జాంగ్ ఉన్.. స్పందించకపోవడమే కారణం. ట్రంప్ (Donald Trump) లేఖకే కాదు.. ఫోన్ చేసినా కిమ్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ఒకవైపు చర్చలకు ట్రంప్‌ ప్రయత్నిస్తుంటే.. మరోవైపు అణ్వాయుధాలు, క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటూ కిమ్‌ అమెరికాకు సవాల్‌ విసురుతున్నారు. గత ఏడాది కిమ్‌తో ఫోన్‌, ఇతర మార్గాల్లో సంప్రదించేందుకు ట్రంప్‌ ప్రయత్నించినా స్పందన రాలేదు. దీంతో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి(యూఎన్) కార్యాలయం ద్వారా లేఖ పంపించారు. అమెరికా అధికారులు ఉత్తర కొరియా దౌత్యవేత్తకు దాన్ని అందించగా.. ఆయన తెరవకుండానే యూఎన్ సమావేశంలో అమెరికా ప్రతినిధి ముందు పెట్టినట్లు సమాచారం.

- Advertisement -

ట్రంప్‌ (Donald Trump) తొలి పదవీకాలంలో ఇద్దరు నేతలు మూడుసార్లు సమావేశమయ్యారు. అణ్వాయుధాలను వదులుకోవడంపై చర్చలు జరిపినా ఫలితం రాలేదు. 2019 తర్వాత మళ్లీ భేటీకి ట్రంప్‌ ప్రయత్నించినా కిమ్‌ షరతులు అంగీకారం కాక ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఉత్తర కొరియా అణ్వాయుధ నిల్వలు 20-30 నుంచి సుమారు 60కి పెరిగినట్లు అంచనా. అమెరికాను చేరుకోగల ఖండాంతర క్షిపణులను కూడా అభివృద్ధి చేసింది. ఘన ఇంధన క్షిపణులు, వాహనాలపై నుంచి ప్రయోగించే సామర్థ్యంతో వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఉత్తర కొరియా మద్దతుగా నిలిచింది. రష్యాకు రాకెట్లు, ఫిరంగి గుండ్లు సరఫరా చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. మరోవైపు క్రిప్టో దొంగతనాల ద్వారా భారీగా నిధులు సమకూర్చుకుంటోంది. బినాన్స్‌ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ నుంచి 6 బిలియన్‌ డాలర్లకు పైగా దొంగిలించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది.

అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలని ట్రంప్‌ పట్టుబడుతుండగా.. తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని అమెరికా అంగీకరిస్తేనే శాంతియుత సంబంధాలు సాధ్యమని కిమ్‌ సంకేతాలిచ్చారు. లేదంటే శాశ్వత ఘర్షణ తప్పదని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ ప్రతిష్టంభనలో పడుతున్నాయి.

Also Read : భారత్‌ ఎదుగుదలకు చైనా అడ్డంకులు.. అమెరికా హెచ్చరిక!

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

గోదావరిఖనిలో ఘోరం.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య

Alltimereport : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని(Godavarikhani)లో ఘోరం చోటు చేసుకుంది. సింగరేణి...

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి.. మంత్రులు, నాయకులకు చంద్రబాబు ఆదేశాలు

Alltimereport : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం రెండున్నరేళ్ల పాలనకు...