Alltimereport : డీలిమిటేషన్ బిల్లుకు (Delimitation Bill) మద్దతుకోసం కేంద్ర ప్రభుత్వంలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదే మంచి అవకాశం అనుకున్న కొన్ని పార్టీలు తమ కీలక డిమాండ్లను బీజేపీ ముందు ఉంచుతున్నాయి. వాటిలో శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని ఎన్సీపీ కూడా ఒకటి. తాజాగా బీజేపీ, ఎస్‌పీ మధ్య జరిగిన బేరసారాల్లో.. కీలక డిమాండ్లు వినిపించినట్లు సమాచారం. కేంద్రంలో సుప్రియా సూలేకు మంత్రి పదవితో పాటు మహారాష్ట్రలో రెండు క్యాబినెట్ బెర్తులు కోరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏలో చేరే అంశంపైనా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖ, జితేంద్ర అవ్హాద్‌కు మరో మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరికి మంత్రి సహాయక పదవులు కూడా కోరుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్ర సీఎం పదవికి సుప్రియా సూలే (Supriya Sule) పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తమ పార్టీకి రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill)కు మద్దతుగా శరద్ పవార్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నారు. బిల్లు ముసాయిదాను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రియా సూలే వెల్లడించారు. లోక్‌సభలో పార్టీకి 8 మంది ఎంపీలు ఉండటంతో వారి మద్దతు కీలకంగా మారింది. శరద్ పవార్ రాజ్యసభకు వెళ్లేందుకు కాంగ్రెస్ గతంలో మద్దతు ఇచ్చిన విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ గుర్తు చేసింది. 10 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీ (SP) అభ్యర్థికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మద్దతు ఇచ్చారని పేర్కొంటూ.. ఇప్పుడు పార్టీ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో డీలిమిటేషన్ అంశం ఇండియా కూటమిలో రాజకీయ చర్చకు దారితీస్తోంది.
Also Read : తెల్లటి పళ్లా.. బలమైన పళ్లా? టూత్‌పేస్ట్‌తో ఏది సాధ్యం?
Follow Us On: Whatsapp


