ఇటీవలే అంతపురం మాజీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాని మోదీకి భారీ కండీషన్లు పెట్టిన సంగతితెలిసిందే… తాను బీజేపీలో చేరాలంటే ఆ పార్టీ పాక్ అక్రమిత కాశ్మీర్ ను భారత్ లోకి మళ్లీ తీసుకురావాలని కండీషన్స్ పెట్టారు…
పీఓకే ను భారత్ మళ్లీ ఇండియాలో కలిపితే అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు జై కొడతానని అన్నారు జేసీ… ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే… దీనిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.. బీజేపీ ఎవరికి పునరావాస కేంద్రం కాదని తెలిపింది…
మోడీ అమిత్ షా నాయకత్వం నచ్చితేనే దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండని ఆ పార్టీ అధికార ప్రతినిధి రఘురాం అన్నారు… కేసుల నుంచి మీ సొంత ప్రయోజనాలకోసం చేరకండని అన్నారు…