ఏపీలో దారుణం బాలికపై యువకుడు అఘాయిత్యం..

ఏపీలో దారుణం బాలికపై యువకుడు అఘాయిత్యం..

0
122

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. కామాంధులు ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు… తెలంగాణలో దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసినా అలాగే నిర్భయ దోషులను ఉరి తిసినా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది…

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది… ఆరేళ్ల బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు… అయితే ఆ సమయంలో బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో యువకుడు భయపడి పారిపోయాడు…

ఇక విషయం తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు..