చాలా మంది స్నేహితులు తమ ఫ్రెండ్ గా భావించిన వారి భార్యలపై కన్నేస్తారు, చెల్లి అక్కా అంటూ వరుస కలిపి కామంతో వారిని తమ కైపులోకి దించుతారు, ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి..
ఒక వ్యక్తి సొంత ఫ్రెండ్ భార్యతోనే ఎఫైర్ పెట్టుకున్నాడు. అది తెలిసిన అతని స్నేహితుడు అలా చేయద్దని చాలా మార్లు చెప్పాడు.
చివరకు తన మాట వినకపోవడంతో పరువు పోవడంతో ఆ అఫైర్ పెట్టుకున్న వ్యక్తిని చంపేశాడు.
పదిహేను సంవత్సరాలుగా ఇరు కుటుంబాలు సన్నిహితంగా నివసిస్తున్నాయి.స్నేహితుడి భార్యపై అతని కన్ను పడింది.
ఆమె కూడా అక్రమ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భర్త లేని సమయంలో ఇద్దరూ రెచ్చిపోయారు..
ఇద్దరినీ చాలా సార్లు హెచ్చరించినా ఫలితం లేదు… తనకు తెలిసిన వారిద్వారా అతనిని హతమార్చడానికి లక్ష రూపాయలతో ఒప్పందం కుదుర్చుకొన్నారు.
చివరకు కల్లు తాగుదాము అని మద్యం త్రాగించి ఆటోలో వెంట తెచ్చుకున్న తల్వార్ లతో పొడిచి హత్యచేసి మృత దేహాన్ని పొదల్లో వేసి ఆటోలో పారిపోయారు, కూపీ లాగితే మొత్తం ఈ విషయం బయటపడింది.