ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ హీరోయిన్….

ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ హీరోయిన్....

0
126

దర్శకుడు త్రివిక్రమ్, స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అరవింద సమేత ఈ చిత్రం విజయం తర్వాత టైగర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు… ఈ చిత్రంలో మరో హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు… ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి..

వాస్తవానికి ఈ చిత్రం దసరాకో లేదా దిపావళికి విడుదల కావాల్సి ఉంది.. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు… అయితే ఈ చిత్నంత్రం తర్వాత యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని మరోసారి త్రివిక్రమ్ తో చేయనున్నాడు… ఈ చిత్రానికి సంబంధించిన కథను రెడీ చేసుకున్నారు దర్శకుడు…

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి… అంతేకాదు ఆమెతో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి… అయినను పోయిరావాలే హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది..