దగ్గుబాటి వారసుడి పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటి ?

దగ్గుబాటి వారసుడి పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటి ?

0
90

ఎన్టీఆర్ వెంట ముందు నుంచి పార్టీలో ఉండి, రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకుంది చంద్రబాబు కంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనే చెప్పాలి, ముందు నుంచి ఆయన ఎన్టీఆర్ కు పెద్ద అల్లుడిగా అలాగే రాజకీయంగా కూడా వెన్నంటి ఉండేవారు, కాని బాబు అదృష్టం బాగుండి రాజకీయ ఎత్తులతో పార్టీ ఆయన చేతిలోకి వెళ్లింది.

ముందు చంద్రబాబు దగ్గుబాటి బాగానే ఉన్నారు, తర్వాత పార్టీ వీడి దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం లా మారిపోయారు..అయితే ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు.. ఇటు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఎన్నికల ముందు చేరారు, అయితే ఇంత సీనియర్ రాజకీయ నేతలు తమ వారసుడి రాజకీయం పై ఆలోచన చేస్తున్నారట.

దగ్గుబాటి వారసుడు హితేష్ చెంచురామ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పౌరసత్వ సమస్య ఉండడంతో పరుచూరి నుంచి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమిపాలయ్యారు, దీంతో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారు అని మంత్రి పదవి ఇస్తారు అని వార్తలు వచ్చాయి, ఆ తర్వాత ఏకంగా చంద్రబాబుకి సరైన దెబ్బ రుచి చూపించాలి అంటే దగ్గుబాటికి అసెంబ్లీ స్పీకర్ పదవి ఇస్తారు అని వార్తలు వినిపించాయి.
అయితే సీఎం జగన్ మాత్రం ఆయన కుటుంబానికి ఎలాంటి పదవి ఇవ్వలేదు, అయితే వారసుడి రాజకీయం పై ఆలోచన చేస్తున్నారట, మళ్లీ ఎన్నికల సమయానికి వారసుడు హితేష్ చెంచురామ్ ని రంగంలోకి దించాలి అని చూస్తున్నారట వెంకటేశ్వరరావు.