భారత్ దెబ్బకు చైనా వణికిపోతోంది, ఆర్దికంగా దెబ్బ కొట్టింది భారత్, అంతేకాదు యాప్స్ నిషేదించడంతో చైనా ఇప్పుడు దిక్కుతోచని స్దితిలో ఉంది.. ఆ దేశానికి లక్షల కోట్ల ఆదాయం పోయింది, ఉద్యోగాలు పోయాయి, ఇక సరిహద్దు ప్రాంతాల్లో భారత్ ఆర్మీ కూడా చైనాకు సరైన జవాబు ఇస్తోంది, మాట్లాడితే కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా సైనికులకి భారత్ ఆర్మీ ధీటైన జవాబు ఇస్తోంది.
ఈ సమయంలో భారత చర్యలకు చైనా సైనికులు భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో విధులకు వెళ్లే చైనా సైనికులు భయపడుతున్నారని తైవాన్ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. సరిహద్దుల్లో విధులకు వెళ్తే అక్కడ నుంచి తిరిగి ఇంటికివెళ్తామా? అసలు అక్కడే మరణిస్తామా అనే భయం వారిలో ఉంది అని చెబుతోంది.
అంతేకాదు దీనికి ఓ కారణం కూడా చెబుతోంది.. ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ నెల 15న హుబే ప్రావిన్సులో సైన్యంలో కొత్తగా చేరిన చైనా యువతకు తూర్పు లడఖ్ సరిహద్దుల వద్ద పోస్టింగ్ ఇచ్చారు. దీంతో వారు బస్సులో వెళ్తూ తమ సైనిక గీతం పాడుతూ ఏడ్చారు, అయితే ఇలా ఏ సైనికులు కన్నీరు పెట్టరు, అయితే భారత్ దెబ్బకు అక్కడ ఏమి జరుగుతుందో అనే భయం వారిలో కనిపిస్తోంది అని అందుకే కన్నీరు పెట్టుకుంటున్నారు అని సోషల్ మీడియాలో కధనాలు కామెంట్లు వస్తున్నాయి, కాని ఇది ఉద్వేగంలో వచ్చిన కన్నీరు అని అక్కడ అధికారులు చెబుతున్నారు.
మరి మీరు ఆ సైనికుల వీడియో చూడండి..
上车后被告知上前线
炮灰们哭的稀里哗啦!pic.twitter.com/wHLMqFeKIa— 自由的鐘聲? (@waynescene) September 20, 2020