బంగారం ధరకు మళ్లీ రెక్కలు వచ్చాయి..గడిచిన 11 రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ స్వల్పంగా పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరిగింది… ఇక్కడ మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది.. మళ్లీ రెండు రోజులుగా ఇండియాలో పసిడి ధర పెరుగుతోంది. మరి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర నేడు పది గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200కు ట్రేడ్ అవుతోంది, 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,200కి చేరింది ఇది కూడా 50 రూపాయలు పది గ్రాములకి ధర పెరిగింది.దేశంలో కిలో వెండి ధర నిన్న రూ.63,200 ఉండగా.. రూ. 950 పెరిగి రూ.64,415కు పెరిగింది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల తగ్గుదలతో బంగారం ధర పెరుగుతోంది. జనవరి వరకూ బంగారం ధరలు ఇలాగే ఉండనున్నాయి.