హైదరాబాద్ కూకట్పల్లి వివేకానందనగర్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపారి దామోదర్ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.28.90 లక్షల నగదు, రూ.71.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.