TS New Secretariat |తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం రోజు జరిగే కార్యక్రమాలు

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం(TS New Secretariat) ప్రారంభ మహోత్సవం ఈ నెల 30న జరగనుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఏప్రిల్ 30 వ తేదీ నుంచే సమీకృత కొత్త పరిపాలనా సౌధం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆ రోజు నుంచి అక్కడే సీఎం, సీఎంఓ అధికార యంత్రాంగం, మంత్రులు పూర్తిస్థాయి విధులు నిర్వర్తించనున్నారు. కాగా సచివాలయ ప్రారంభ వేడుకలు ఇలా ఉండనున్నాయి.

- Advertisement -

TS New Secretariat | సచివాలయ ప్రారంభ కార్యక్రమాలు..

సూర్యోదయం (ఉ. 6 గంటల) తరవాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం.

మధ్యాహ్నం 1 గంట 20 నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి.

తరవాత సమీకృత కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్.

ఆ వెంటనే 6 వ అంతస్తులోని తన ఛాంబర్లో కొలువుదీరనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.

మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో తమతమ ఛాంబర్లలో కొలువుదీరనున్న వివిధ శాఖల మంత్రులు.

మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్.

గ్యాదరింగ్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం కేసీఆర్.

ఆ తరవాత తమతమ స్థానాల్లో కొలువుదీరనున్న అధికారగణం, ఇతర ప్రభుత్వ యంత్రాంగం.

Read Also: మంచిర్యాల జిల్లా మహేష్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...