Hyderabad | ఉప్పల్‌లో ఉన్మాది ఘాతుకం.. గొంతు కోసి..

-

Hyderabad | ప్రేమ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఇంట్లో పెద్దలను ఎదిరించడమే కాకుండా ఇంట్లో నుంచి పారిపోవడానికి కూడా వెనకడుగు వేయరు. మరికొందరైతే ప్రాణాలు తీసుకోవడానికి, ప్రాణాలు తీయడానికి కూడా భయపడరు. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్‌(Hyderabad)లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ప్రేమ అంగీకరించినందుకు ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం(Khammam) జిల్లాకు చెందిన ఉడుం లక్ష్మీనారాయణ(32) హబ్సిగూడలో నివాసం ఉంటున్నాడు. రామంతపూర్‌కు చెందిన యువతి (దగ్గరి బంధువు) వెంటబడుతూ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇప్పటికే అతనికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సదరు యువతికి వరుసకు బావ.

రెండు రోజుల క్రితం మెట్రో రైలు దిగి స్టేషన్ కిందికి వచ్చిన ఆ యువతిని కారులో బయటకు తీసుకెళ్లాడు. ప్రేమ విషయంలో ఇద్దరి మద్య మాట మాట పెరగడంతో ఆగ్రహించిన ఉన్మాది కత్తితో ఆమె గొంతు కోసి పరారీ అయ్యాడు. అక్కడే పడిపోయిన ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: సిద్దిపేట జిల్లాకు అరుదైన గౌరవం.. అందులో చోటు!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kailash Gahlot | ఆమ్ ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ ఝలక్..

ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) కీలక నిర్ణయం...

Rajasaab | ‘రాజాసాబ్’ కోసం స్పెషల్ సాంగ్ రెడీ..

ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘రాజాసాబ్(Rajasaab)’. ప్రభాస్...