హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్‌లో గల అంకుర హాస్పిటల్(Ankur Hospital)లో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. పది అంతస్తుల భవనంలోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగి మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఆసుపత్రిలో చాలామంది రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
- Advertisement -
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రోగులను హుటాహుటిన బయటకు తరలిస్తు్న్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల నగరంలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.