యాంకర్ రవితో ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ బిగ్ ప్లాన్

యాంకర్ రవితో ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ బిగ్ ప్లాన్

0
92

బుల్లితెర లో మెయిల్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ యాంకర్లలో రవి ఒకరు.. అయితే ప్రదీప్ తో సమానంగా అతనికి అవకాశాలు ఉంటాయి, సరదాగా షోని మంచి ఆసక్తిగా పంచ్ లతో నడిపిస్తాడు అనే పేరు ఉంది. అయితే యాంకర్ రవి ప్రస్తుతం ఈటీవీతో బాగా ట్రావెల్ అవుతున్నాడు. అనేక షోలు కూడా చేస్తున్నాడు. తాజాగా ఢీ లో యాంకర్ గా మారిపోయి మరిన్ని నవ్వులు పంచుతున్నాడు.

ఇక టీఆర్పీలో దూసుకుపోయే పటాస్ షో కూడా చేస్తున్నాడు రవి, అయితే ఇప్పుడు పటాస్ కు గుడ్ బై చెబుతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం వారు వేరే షోలు చేయకూడదు అని కండిషన్ పెట్టారట. కాని రవి మాత్రం శాటిలైట్ ఛానల్ తో కూడా ఓ షో చేస్తున్నాడు. అందుకే అది మంచి ఆఫర్ కాబట్టి పటాస్ వదులుకుంటున్నాడు అని తెలుస్తోంది.

అంతేకాదు రవి సినిమాలతో తన కెరియర్ ని మరింత స్పీడుగా చేసుకోవాలి అని చూస్తున్నాడు, అలాగే పలు ఇంటర్వ్యూలకు కూడా ప్లాన్ చేస్తున్నాడు. యాంకర్ గా ఇంటర్యూలు కూడా చేయాలని భావిస్తున్నాడు, అలీ తో సరదాగా టైపు కాన్సెప్ట్ తో యాంకర్ రవి త్వరలో ఓ షో చేసే అవకాశాలు ఉన్నాయట, ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ దీనికి పక్కా ప్లాన్ వేస్తోంట.