నితిన్ కోసం మహేష్ బాబు

నితిన్ కోసం మహేష్ బాబు

0
96

నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆగష్టు 9న మన ముందుకు రానున్నది . వేగేశ్న సతీష్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన కళ్యాణ వైభోగం లిరిక్స్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటలు ఆకట్టుకున్నాయి. 70 మంది భారీ తారాగణం తో దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ మేకింగ్ వీడియోకు కూడా మంచి స్పందన వచ్చింది. కాగా, సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ విడుదల కానుండడం మరో విశేషం. ఆగష్టు 2 సాయంత్రం 5:30 గంటలకు మహేష్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

శ్రీనివాస కళ్యాణం’ ఆగష్టు 9న, మహేష్ బాబు జన్మదినం రోజే ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. నందిత శ్వేత మరో కథానాయికగా నటిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. రాజేంద్రప్రసాద్ .. ఆమని .. సీనియర్ నరేశ్ కనిపించనున్నారు.