వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

-

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న డొక్కా.. ఇప్పుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

కాగా 2004లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తాడికండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించి మంత్రిగా కూడా సేవలు అందించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లు సమయంలో ఆయన వైసీపీలో చేరిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...