భార్య గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పవన్ కల్యాణ్.. ఫొటోలు వైరల్

-

Pawan Kalyan – Anna Lezhneva | పవర్ స్టార్, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఈ స్నాతకోత్సవ వేడుకకు పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి పట్టా అందుకున్న అన్నాతో కలిసి పవన్ ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో అన్నా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ పట్టా తీసువడానికి వెళ్తుండగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) వెనకాలే నడుస్తూవెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ అంతా కూడా సింగపూర్‌(Singapore)లో కూడా తన స్వాగ్, స్టైల్ ఏమాత్రం మారలేదంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే 2011లో పవన్ కల్యాన్ హీరోగా వచ్చిన ‘తీన్‌మార్’ సినిమాలో అన్నా లెజినోవా కూడా నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరికి స్నేహం ఏర్పాడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో 2013లో వారు వివాహబంధంతో ఏకమయ్యారు. వీరిద్దరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నాడు.

Read Also: శ్రీరెడ్డిపై కేసు.. ఆ వ్యాఖ్యలే కారణం..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కంగనా ‘ఎమర్జెన్సీ’కి లైన్ క్లియర్..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రధాన పాత్రలో, స్వీయ దర్శకత్వంలో...

అవిసె గింజలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

డైటింగ్ చేద్దామని స్టార్ట్ చేసిన వారిలో చాలా మంది తమ ఆహారంలో...