బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఫ్రాణాలతో ఉండాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ముంబై పోలీసులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సందేశాలు పంపింది. ఇందులో సల్మాన్ ఖాన్‌కు దుండగులు రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్‌రూమ్‌కు చెందిన వాట్సాప్ నెంబర్‌కు సోమవారం అర్ధరాత్రి ఈ సందేశం వచ్చింది. ‘‘నేను లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) సోదరుడిని. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే అతడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే మేము డిమాండ్ చేసినట్లు రూ.5కోట్లు ఇవ్వాలి. వీటిలో ఏదీ జరగని పక్షంలో సల్మాన్‌ను సఫా చేసేస్తాం. మా గ్యాంగ్ ఇంకా క్రియాశీలకంగానే ఉంది’’ అని మెసేజ్‌లో ఉందని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఈ మెసేజ్‌తో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ వచ్చిన మెసేజ్‌పై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఝార్ఖండ్‌కు చెందిన 24 ఏళ్ల కూరగాయాల వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా ఇప్పుడు మరోసారి బెదిరింపులు రావడంతో పోలీసులు మళ్ళీ అలెర్ట్ అయ్యారు. ఈ తాజా బెదిరింపులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనక ఎవరున్నారో వీలైనంత త్వరగా గుర్తిస్తామని చెప్పారు. దీంతో పాటుగా సల్మాన్ ఖాన్(Salman Khan)కు భద్రతను కూడా పెంచారు పోలీసులు.