రాజకీయ భవిష్యత్ ప్రకటించిన BRS MLA రేఖా నాయక్

-

బీఆర్ఎస్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ సిగ్గింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్(Rekha Nayak) రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆమె భర్త కాంగ్రెస్ గూటికి చేరగా.. ఆమె కూడా కాంగ్రెస్‌లోనే చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తన పదవీకాలం పూర్తయ్యేవరకు బీఆర్ఎస్‌లోనే ఉంటానని.. ఆ తర్వాతే కాంగ్రెస్‌లో చేరతానని తేల్చి చెప్పారు. తాను గతంలో కాంగ్రెస్‌లోనే పనిచేశానని.. మళ్లీ అక్కడికే వెళ్తానని అభిప్రాయప్డడారు.

- Advertisement -

ఇన్నేళ్లుగా పార్టీలో పనిచేసినా కేసీఆర్ తనను నిర్లక్ష్యం చేశారని అసహనం వ్యక్తం చేశారు. స్థానికంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న తనను కాదని.. ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చిన అతనికి టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వచ్చే 50 రోజులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. నా జీవితం ప్రజలకే అంకితమని ప్రకటించారు. తన చివరి జీవితం వరకు ప్రజలతో కలిసి ఉంటానని చెప్పారు. మిగిలిన పనులు చేస్తానని, ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఇంకా వేరే ఆలోచించ లేదని, లాస్ట్ ఊపిరి వరకు ఖానాపూర్‌(Khanapur)లో ఉంటానని ఆమె(Rekha Nayak) వెల్లడించారు.

Read Also: బంగారు పతకం.. తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా రికార్డ్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...