ఈటల రాజేందర్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు: బండి సంజయ్

-

తెలంగాణ బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌(Etela Rajender)తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు పెట్టాలని భావించినా అది జరుగని పని అని కొట్టిపారేశారు. మేమంతా ఒక్కటే, మా అందరి లక్ష్యం ఒక్కటే.. అదే కేసీఆర్(KCR) ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని స్థాపించడమే మా ధ్యేయమని అన్నారు. అందులో భాగంగా ఈటల రాజేందర్ సహా పార్టీ నేతలు ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. తన వల్లనే అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వాస ఘాతకుడని అన్నారు. తల్లిదండ్రులు కూలీ పని చేసి చదివిస్తే కష్టపడి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరితే ప్రొబేషనరీ పేరుతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యూలరైజ్ చేయకుండా.. నాలుగేళ్లు జాప్యం చేయడం దుర్మార్గమని బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. అసెంబ్లీ వేదికగా రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు.

- Advertisement -
Read Also: పొంగులేటితో ఈటల భేటీ పై బండి సంజయ్ రియాక్షన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...