చైతు, సామ్ మధ్యలోకి మరో యువతి…..ఎవరో తెలుసా..!

చైతు, సామ్ మధ్యలోకి మరో యువతి.....ఎవరో తెలుసా..!

0
445

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే చైతు, సామ్ అని అందరూ టక్కున చెప్పేలా ఉంటారు ఈ జంట. అక్కినేని నాగ చైతన్య, సమంత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజిబిజీగా గడిపేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్యలోకి మరో అమ్మాయి వచ్చిందట. దీంతో ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందట.

కాకపోతే ఇది నిజ జీవితంలో కాదులెండి. ప్రస్తుతం చైతు, సామ్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ డైరెక్షన్‌లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే.

భార్యాభర్తలైన చైతు, సమంత మధ్యలోకి మరో అమ్మాయి రావడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుందట. అనంతరం తమ ప్రేమ కారణంగా ఈ జంట తమ బంధాన్ని ఎలా నిలుపుకుంటుందనేది ఈ సినిమా కథ అని సమాచారం. భార్యాభర్తల మధ్య ప్రేమ విలువను తెలిపే కథతో ఈ సినిమా రూపొందుతోంది.