బిగ్ బాస్ 2 లో వచ్చే వారం ఎలిమినేట్ అతనేనా ?

బిగ్ బాస్ 2 లో వచ్చే వారం ఎలిమినేట్ అతనేనా ?

0
73

బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో సెకండ్ సీజన్ జరుగుతుంది. బిగ్ బాస్ 2 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తిచేసుకుంది. బిగ్ బాస్ షోకు జనాలు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం ‘సస్పెన్స్’ ఎప్పుడు ఏం జరుగుతుంది.? ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.? ఎవరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారనే దానిపైనే షో రేటింగ్ ఆధారపడి ఉంటుంది.

కానీ ఇప్పుడా సీక్రెట్స్ బయటకు వస్తూ షో నిర్వాహకులకు తలనొప్పులు తెస్తున్నాయి. దీని వల్ల ప్రేక్షకుల్లో బిగ్ బాస్ పై ఆసక్తితగ్గిపోతుంది. టెలివిజన్ లో టెలీకాస్ట్ అవ్వకముందే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ముందురోజే తెలిసిపోతోంది. సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక ఇప్పుడు ఏదీ దాచలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడిదే బిగ్ బాస్ టీం టెంక్షన్ కి గురిచేస్తుంది.

గడిచిన మూడోవారం శ్యామల ఎలిమినేట్ అవ్వడానికి ముందురోజే ఆమె ఫొటోలు బయటకు వచ్చాయి. భానుశ్రీ ఎలిమినేషన్ షో ప్రసారమవడానికి 7 గంటల ముందే ఆమె ఎలిమినేట్ అయిన విషయం లీక్ అయ్యింది.

ప్రస్తుతం ఈ వారం మరో లీక్ బయటకు వచ్చింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది సామ్రాట్ అని తేలింది. అంతేకాదు ఓటింగ్ లెక్కలు కూడా ఆన్ లైన్ లోకి వచ్చాయి. దీనికి బాగా హర్ట్ అయిన సామ్రాట్ ఫ్యాన్స్ అతడికి ఓట్లు కురిపిస్తున్నారట.. సామ్రాట్ వెళ్లిపోతే తేజస్వి తో సాన్నిహిత్యం ఉండక షో రక్తి కట్టదనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ టీం అతడికి ఓట్లు కురిపించేందుకు ఈ లీక్ లు ఇచ్చేందనే వాదనలు బయటకు వస్తున్నాయి.

అయితే ఏది ఏమైనా సస్పెన్స్ గా సాగితేనే బిగ్ బాస్ కు మజా.. ఇలా ఎలిమినేషన్ అవ్వడానికి ముందే ఎవరు బయటకు వెళ్లిపోతారో తెలిసిపోతే షో పై అందరికీ ఆసక్తి పోతుంది. బిగ్ బాస్ టీం ఇప్పటికైనా ఈ లీక్ లు కాకుండా జాగ్రత్త పడితే మంచిందని ప్రేక్షకులు కోరుతున్నారు.