బీజేపీ కి షాక్ ఇవ్వనున్న బాబు…..ముహూర్తం ఫిక్స్

బీజేపీ కి షాక్ ఇవ్వనున్న బాబు.....ముహూర్తం ఫిక్స్

0
161

విభజన హామీల అమలుతో పాటు అన్ని విషయాల్లోనూ ఏపీకి అన్యాయం చేసిన బీజేపీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకోవాలని చూస్తున్నాడు. దీనికి అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఆ సమయం రానే వచ్చినట్టు కనిపిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభంలోపే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహ రచన చేస్తోంది తెలుగుదేశం పార్టీ. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో.. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మరోసారి టీడీపీ అధినేత సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరో పదిరోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతుండడంతో.. ఏపీతో పాటు ఢిల్లీలోనూ ఉద్యమ వేడిని రగిలించేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోంది. హక్కుల సాధనకోసం దీక్షలు చేస్తూనే.. ఏపీకి చేసిన అన్యాయంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌, బీటెక్‌ రవి చేసిన దీక్షతోపాటు.. విశాఖలో రైల్వే జోన్‌కోసం ఎంపీలు చేసిన ఒక రోజు దీక్షతో కేంద్రానికి సెగ తగిలేలా చేసింది టీడీపీ. దీనితర్వాత వెనుకబడిన జిల్లాలకు నిధులు డిమాండ్‌ చేస్తూ.. అనంతపురంలో మరో ఉద్యమానికి ప్రణాళిక రచిస్తోంది.

కేంద్రంపై మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు సైతం టీడీపీ సమాయత్తం అవుతోంది.
రాబోయే పార్లమెంటు సమావేశాల్లో రాజ్య సభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికోసం బలాబలాలను లెక్కగడుతోన్న టీడీపీ ఎన్టీఏ కూటమికి కావాల్సినన్ని ఓట్లు లేవని భావిస్తోంది. ఇదే అదనుగా జాతీయ స్థాయిలో బీజేపీని మళ్ళీ ఇరుకున పెట్టాలని బాబు భావిస్తున్నాడు. ప్రాంతీయ పార్టీల తరపును ఓ అభ్యర్థిని నిలబెడితే బాగుంటుందన్న సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని సంప్రదింపులు చేయాలనీ బాబు చూస్తున్నాడు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరిగితే వైసీపీ తెరచాటు ఒప్పందం బట్టబయలవుతుందని భావిస్తోంది