పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

0
110

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏం ప్రజాసేవ చేశాడని ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారని ఆంజనేయులు ప్రశ్నించారు. ‘అందరినీ ప్రశ్నించే పవన్ మీ అన్న చిరంజీవిని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకునేందుకే కేటీఆర్‌ ను పవన్ పొగుడుతున్నారని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే జనసేనకు పడుతుందని ఆంజనేయులు వ్యాఖ్యానించారు.నారా లోకేష్‌ను విమర్శించే నైతిక అర్హత పవన్‌ కు లేదన్నారు.