తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

-

Telangana IPS Transfers | తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక పోస్ట్‌లలో ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీ పోస్ట్ నుంచి వీసీ సజ్జనార్‌ను కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో మహేష్ మురళీధర్ భగవత్‌ను నియమించింది. ఈ మేరకు నవంబర్ 12న ప్రభుత్వం జీవో నంబర్ 1654 జారీ చేసింది. సజ్జనార్‌కు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బాధ్యతలు అప్పగించింది. అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ బాధ్యతలను కూడా అప్పగించింది.

- Advertisement -

ఇక ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ సీపీగా నియమించింది. మరోవైపు స్వాతి లక్రాను జైళ్లు, దిద్దుబాటు సేవల విభాగం డీజీగా బదిలీ చేసింది. అనిల్ కుమార్‌ను ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. నాగిరెడ్డికి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. చారు సిన్హాకు అవినీతి నిరోధక శాఖ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఈ జీవో ద్వారా 21 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారుల లిస్ట్ 

జైళ్ల శాఖ డీజీగా ఉన్న డాక్టర్ సౌమ్య మిశ్రా బదిలీ

డీజీపీ, మహిళా భద్రత విభాగం, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా సౌమ్య మిశ్రాకు బాధ్యతలు

పోలీస్ ఆర్గనైజేషన్, పోలీస్ లీగల్ విభాగాల డీజీపీగా అదనపు బాధ్యతలు

పోలీస్ ఆర్గనైజేషన్, హోంగార్డ్స్ డీజీపీగా ఉన్న స్వాతి లక్రా బదిలీ

జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డీజీగా స్వాతి లక్రా నియామకం

హోంగార్డ్స్ డీజీపీగా అదనపు బాధ్యతలు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ మురళీధర్ భగవత్ నియామకం

సీవీ సజ్జనార్ స్థానంలో మహేష్ భగవత్

ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా చారు సిన్హా నియామకం

సీఐడీ డీజీపీగా చారు సిన్హాకు అదనపు బాధ్యతలు

టీజీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్ నియామకం

గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా అనిల్ కుమార్ స్థానంలో విక్రమ్ సింగ్ మాన్..

తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా వీసీ సజ్జనార్ నియామకం

సివిల్ సప్లైస్ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి నియామకం

అదనపు డీజీపీగా సంజయ్ కుమార్ జైన్‌కు ట్రైనింగ్ బాధ్యతలు

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బాధ్యతలతో పాటు అదనపు డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్

తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర

అదనపు డీజీపీ (L&O)గా ఆకున్ సబర్వాల్ నియామకం

ఐజీ, డీఐజీ స్థాయిలో మార్పులు…

యాంటీ కరప్షన్ బ్యూరో ఐజీగా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి

ఇంటెలిజెన్స్ ఐజీగా కార్తికేయ నియామకం

రైల్వే ఐజీగా కే. రమేష్ నాయుడు

రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాల్లో జాయింట్ డైరెక్టర్‌గా డి. జోయల్ డేవిస్

డీఐజీ ఇంటెలిజెన్స్‌గా ఆర్. భాస్కరన్‌కు అదనపు బాధ్యతలు

డీఐజీ జోన్-2 బాసరగా కే. నారాయణ నాయక్

డీఐజీ కోఆర్డినేషన్‌గా ఎల్.ఎస్. చౌహాన్

డీఐజీ జోన్-6 చార్మినార్‌గా అదనపు బాధ్యతలు..

డీఐజీ జోన్-8 జోగులాంబగా చందనా దీప్తికి అదనపు బాధ్యతలు

డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), టీజీ-టీఎంఏఆర్ఎస్‌గా శ్రీ బాలాదేవి

హైదరాబాద్ సిటీ డీసీపీ (SM&IT)గా వి. అరవింద బాబు నియామకం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...

భారత ఫుట్‌బాల్‌కు జర్మనీ ఫార్ములా!

భారత ఫుట్‌బాల్ (Indian Football) భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని...