Alltimereport : బాలీవుడ్లో సినిమాలు చేసినా తనకు ఎప్పుడూ సౌత్ ఇండియానే స్పెషల్ అని యాక్టర్ సమీరా రెడ్డి (Sameera Reddy) తెలిపారు. దక్షిణాది ప్రేక్షకుల నుంచే ఎక్కువ ప్రేమ, గౌరవం లభించాయని నటి సమీరా రెడ్డి తెలిపారు. ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’లో మేఘన పాత్రను 18 ఏళ్ల తర్వాత కూడా అభిమానులు గుర్తుపెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హిందీ సినిమాల్లో నటించినా తనను తాను దక్షిణాది నటిగానే భావిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అశోక్’, ‘జై చిరంజీవ’, ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సమీరా.. దక్షిణాది చిత్రాలు ఎప్పటికీ తనకు ప్రత్యేకమని పేర్కొన్నారు.
2002లో వచ్చిన తొలి చిత్రం ‘మైనే దిల్ తుజ్కో దియా’ సమయంలో తన చర్మం తెల్లగా కనిపించేందుకు రెండు, మూడు షేడ్లు ఎక్కువగా మేకప్ వేసేవారని గుర్తుచేసుకున్నారు. అందం అంటే తెల్లగా ఉండటమేనా అని ప్రశ్నించారు. ఇప్పటికీ మహిళలు సొంత కుటుంబాల్లోనే రంగు, బరువు ఆధారంగా విమర్శలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ‘ఆఖ్రీ సవాల్’ చిత్రంలో నటించిన సమీరా (Sameera Reddy).. ప్రస్తుతం సోషల్‌మీడియా కంటెంట్ క్రియేటర్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా కొనసాగుతున్నారు.
Also Read : అర్ధనారీశ్వరుడి శిల్పంతో రాహుల్ కొత్త అస్త్రం
Follow Us On: Whatsapp


