ఓటేసిన సీఎం చంద్రబాబు..

-

Alltimereport : ఏపీలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (Mangalagiri-Tadepalli Corporation) ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఎంపీయూపీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

ఓటు వేసిన అనంతరం చంద్రబాబు (Chandrababu) ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు కేవలం వేలిపై పడే సిరా చుక్క కాదని, రాష్ట్ర భవిష్యత్తును మార్చగల శక్తి అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటు ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గదని చెప్పారు. స్థానికంగా ఎన్నుకునే నాయకుల వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజలకు తమ సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. డబ్బుకు ఓటు అమ్ముకోకుండా ఓటు వేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చంద్రబాబు అన్నారు.

Also Read : తెల్లటి పళ్లా.. బలమైన పళ్లా? టూత్‌పేస్ట్‌తో ఏది సాధ్యం?

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అమెరికా 25శాతం టారిప్‌పై కేంద్రం రియాక్షన్ ఇదే!

Alltimereport : అమెరికా, భారత్ మధ్య మరోసారి టారిఫ్ చర్చలు మొదలయ్యాయి....

149 ఏళ్లలో తొలిసారి.. సఫారీల సరికొత్త చరిత్ర!

Alltimereport : టెస్ట్ క్రికెట్ చరిత్రలో 149 ఏళ్ల తర్వాత మరో...