లోకేశ్ శుభాకాక్షలు…

లోకేశ్ శుభాకాక్షలు...

0
81

తమ కష్టంతో జాతిసంపదను పెంచే కార్మికులు, శ్రామికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రపంచంలో ఏ సమాజమూ ముందుకు పోలేదని లోకేష్ అన్నారు. అందుకే మేడే అన్నది విశ్వవ్యాప్త వేడుక అయ్యిందని తెలిపారు…గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సంతకాన్ని ఉపాధిహామీ చట్టం కింద 30లక్షల శ్రామిక కుటుంబాలకు లబ్దిచేకూర్చే ఫైలుపైనే చేశానని గుర్తు చేశారు లోకేశ్…

అలాగే భవన నిర్మాణ సంక్షేమ మండలిలో ఉపాధి హామీ కార్మికులకు చోటు కల్పించానని అన్నారు. గడచిన ఏడాది రాష్ట్రంలో కార్మికులకు ఏమాత్రం మంచి జరగలేదని అన్నారు. ఇసుక కొరత, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పరిశ్రమలు మూతపడటం, ఆ తర్వాత లాక్ డౌన్ తో కార్మికులు చాలా నష్టపోయారు. అష్టకష్టాలు పడ్డారన్నారు

వచ్చే రోజుల్లో అయినా కార్మికులకు, శ్రామికులకు మంచి జరగాలని కోరుకుంటూ, వారందరికి మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు..