ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఈజీగా నిమిషాల్లోనే తెలిసిపోతోంది.. ఇక వారిలో ఉన్న టాలెంట్ ని కూడా చాలా మంది సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు.. అయితే ఇప్పుడు మనం ఓ పాన్ గురించి మాట్లాడుకోవాలి, ఇది అన్నింటికంటే భిన్నమైంది, పాన్ మనం చాలా రకాలు చూశాం, ఇది గోల్డ్ పాన్.
పాన్ అంటే ఆకు, వక్క, సున్నం ఉంటాయి అనేక రకాల రుచి వచ్చే దినుసులు వేస్తారు, అయితే ఇటీవల కొందరు టూటీఫ్రూటీ, పండ్లముక్కల వంటివి కూడా చేర్చుతున్నారు. కాని తాజాగా ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని యము పంచాయత్ షాప్ సరికొత్తగా బంగారు పాన్ తయారుచేసింది …ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ షాప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన రఫెల్లో గోల్డ్ పాన్ తయారీ నెటిజన్లు అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఆ వీడియో మీరు చూసేయండి దీని ధర కూడా అక్కడ తెలిపారు. దీని కాస్ట్ 600 రూపాయలు
పాన్ వీడియో
https://www.instagram.com/tv/CL8nFzHj3Dg/?utm_source=ig_embed