కొద్ది రోజుల్లో ఆమె పెళ్లి – వరుడు మాజీ లవర్ కుటుంబం ఈమెని చంపేశారు – ఎంత దారుణమంటే

కొద్ది రోజుల్లో ఆమె పెళ్లి - వరుడు మాజీ లవర్ కుటుంబం ఈమెని చంపేశారు - ఎంత దారుణమంటే

0
86

బీహార్ లోని నలంద జిల్లాలో దారుణం జరిగింది.. అక్కడ ఓ యువతికి పెళ్లి సెట్ అయింది.. ఆమె వయసు 19 ఏళ్లు ఇక మరి కొద్ది రోజుల్లో ఆమె వివాహం జరగనుంది.. ఇక ఇంట్లో వారు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు, ఇంతలో దారుణం జరిగింది.

ఆమెని అత్యంత దారుణంగా చంపేశారు. దీంతో కుటుంబం కన్నీరు మున్నీరు అయింది.

 

గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాళ్లూ చేతులు కట్టేసి తల నరికి మొండాన్ని పారేసి పోయారు. ఇక లాంచనాలు అన్నీ కూడా వరుడు కుటుంబానికి ఇచ్చారు, కాని ఇంత దారుణంగా ఆమె చనిపోవడానికి కారణం ఏమిటో అర్దం కాని పరిస్దితి.

వరుడి లవ్ ఎఫైర్ కారణంగానే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.

 

అయితే తాజాగా తెలుస్తున్న దాని ప్రకారం వరుడి లవర్ కుటుంబం సభ్యులు ఈ యువతిని చంపి ఉంటారు అని భావిస్తున్నారు, దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకి ఇంత దారుణమైన పరిస్దితి వచ్చింది.. స్ధానికులు పోలీసులు అందరూ షాక్ అయ్యారు, ఎవరిని వదిలిపెట్టమని ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పోలీసులు.