కరోనా టెన్షన్..ఒక్కరోజే ఎన్ని కేసులంటే?

Corona tension..how many cases in one day?

0
53

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 18,987 మంది​కి కరోనా పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ ధాటికి మరో 246 మంది మరణించారు. ఒక్కరోజే 19,808 మంది రికవరీ అయ్యారు. అక్టోబరు 13న 13,01,083 కరోనా​ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 58,76,64,525కు చేరింది.

బుధవారం ఒక్కరోజే 35,66,347 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 96,82,20,997కు చేరినట్లు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.

కొత్తగా 4,40,664 మందికి వైరస్ సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 7,506 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,99,37,425కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,89,385కు పెరిగింది.