భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌కు మృతదేహాలు కొట్టుకు వచ్చిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లాలో వెలుగు చూసింది. గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కన్వ జలాశయం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కన్వ నది ఒడ్డునే స్థానికులు మృతదేహాలను పూడ్చేవారు. అయితే ఇటీవల భారీ వర్షాలకు నది ఉద్ధృతి పెరగడం వల్ల ఆ శవాలన్నీ నదిలో కొట్టుకుపోయాయి.