బాలుడిపై యువతి అఘాయిత్యం..అంతటితో ఆగకుండా..

Young woman abuses boy .. Don't stop with all that ..

0
74

దగ్గరి బంధువైన బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడింది ఓ యువతి. అంతేకాకుండా దానిని వీడియో తీసి బెదిరించి రూ. 16 లక్షలు కాజేసింది మాయ కి’లేడీ’. దీనికి మాజీ ప్రియుడితో కలిసి ఆమె ఈ పన్నాగానికి ఒడిగట్టింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..టోలీచౌకిలో ఉంటున్న ఓ కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారారు. ఈ క్రమంలో అల్మారాలో ఉండాల్సిన రూ. 20 తులాల బంగారం, నగదు కనిపించలేదు. వెతికినా ఫలితం లేకపోవడంతో అతని కుమారుడిని బంగారం విషయమై తల్లి ప్రశ్నించింది.

ఆ బంగారం తానే తీశానని, బెంగళూరులో ఉండే తండ్రి బంధువైన యువతికి ఇచ్చినట్టు చెప్పడంతో అందరూ షాకయ్యారు. అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా బాలుడు మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపెట్టాడు. తాను చదువుకుంటున్న పాఠశాల వద్దకు వచ్చిన యువతి తనను చార్మినాల్‌లోని లాడ్జ్‌కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పాడు. మాజీ ప్రియుడితో కలిసి దీనిని ఆమె వీడియో తీసిందని, ఆ తర్వాత ఆ వీడియో చూపించి బెదిరించిందని చెప్పాడు.

భయపడి మరో గత్యంతరం లేక ఇంట్లోని 20 తులాల బంగారంతో పాటు రూ. 6 లక్షల నగదు ఆమెకు ఇచ్చేశానని వివరించాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిపై మూడుసార్లు అఘాయిత్యానికి పాల్పడిన నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.