తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..పెరిగిన పాజిటివ్ కేసులు..జిల్లాల వారిగా వివరాలివే..

Telangana Corona Bulletin Release..Increased Positive Cases

0
79

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో 4,416 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీనితో ఇప్పటి వరకు 7,26,819 మంది మహమ్మారి బారిన పడ్డారు.

ఇక ఈరోజు 1,920 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కొవిడ్ నుంచి 6,93,623 మంది రికవరీ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. కొవిడ్ మరణాలు 4069కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29,127 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ ఒక్కరోజే 1670 కేసులు నమోదవడం గమనార్హం.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 25
కొత్తగూడెం 88
జిహెచ్ఎంసి 1670
జగిత్యాల 65
జనగామ 41
జయశంకర్ భూపాలపల్లి 36
జోగులాంబ గద్వాల 50
కామారెడ్డి 40
కరీంనగర్ 91
ఖమ్మం 117
కొమరం భీం ఆసిఫాబాద్ 32
మహబూబ్ నగర్ 99
మహబూబాబాద్ 70
మంచిర్యాల 92
మెదక్ 52
మేడ్చల్ మల్కాజ్ గిరి 417
ములుగు 27
నాగర్ కర్నూల్ 72
నల్లగొండ 90
నారాయణపేట 36
నిర్మల్ 36
నిజామాబాద్ 75
పెద్లపల్లి 73
రాజన్న సిరిసిల్ల 44
రంగారెడ్డి 301
సంగారెడ్డి 99
సిద్దిపేట 73
సూర్యాపేట 59
వికారాబాద్ 63
వనపర్తి 48
వరంగల్ రూరల్ 70
వరంగల్ అర్బన్ 178
యాదాద్రి భువనగిరి 89