ఆఫ్రికా దేశం కామెరూన్లో నిర్వహించిన సాకర్ పోటీల్లో తీవ్ర విషాదం జరిగింది. ఆతిథ్య జట్టు ఆటను చూసేందుకు పరిమితికి మించి ప్రేక్షకులు వచ్చారు. దీంతో అధికారులు స్టేడియం గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో బయట తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కామెరూన్ గవర్నర్ నసేరి పౌల్ బియా తెలిపారు.