అడవిశేషు-అకీరా నందన్ భేటి.. ఫోటో వైరల్.!

అడవిశేషు-అకీరా నందన్ భేటి.. ఫోటో వైరల్.!

0
105

మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు ఎంతో మంది ఉండగా పవన్ వారసుడు అకీరా నందన్ అడవిశేషు కలసి తీయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. సినీ వాతావరణానికి అమడ దూరంలో ఉన్న అకీరా అడవి శేషును ఎప్పుడు ఎందుకు కలిశాడు అని వారిద్దరు తీయించుకున్న ఫోటోతో సర్వ్రతా చర్చలు జరుగుతున్నాయి.

అకీరా లుక్ చూసి పవన్ అభిమానులు ఆరడుగుల ఒడ్డు పొడుగుతో కనిపిస్తున్న అకిరాలో పవన్ పోలికలకంటే అతని తల్లి రేణు దేశాయ్ పోలికలే ఎక్కువగా ఉనాయని అంత పెరిగినా అకీరా మొకంలో పసితనం చాయలు ఇంకా పోలేదని కామెంట్స్ చేస్తున్నారు.

అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కనీసం ఆరు సంవత్సరాలు పట్టొచ్చని పవన్ అభిమానులు అనుకుంటున్నారు. అకీరా ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ అంతర్జాతీయ స్కూల్‌లో చదువుతున్నాడు. కాళీ సమయంలో పవన్ ఇంటికి వెళ్లి చాలా సమయం గడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ మాత్రం అకీరా చదువు పూర్తయిన తరువాతే అతడి సినిమా ఎంట్రీ గురించి ఆలోచించనున్నట్లు సమాచారం. పవన్ పంజా సినిమాలో విలన్‌గా నటించిన శేషు అటే పవన్‌కు ప్రత్యేక అభిమానం అదే అభిమానంతో అకీరా కూడా ఇలా అడవి శేషును కలిసాడేమొ అన్న సందేహాలు కలుగుతున్నాయి. అకీరా లేటెస్ట్ లుక్‌తో పవన్ అభిమానులు మంచి జోష్‌లో ఉన్నారు.