హైదరాబాద్ లోని సైదాబాద్ లోని ఆదర్శనగర్ కాలనీలో ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ సర్వీస్ సెంటర్ ను ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి సోమవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సర్వీస్ సెంటర్ నిర్వాహకులు జాల లింగయ్యను కార్పొరేటర్ శ్వేతామధుకర్ రెడ్డి సన్మానించారు. ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ కు మంచి సర్వీస్ ఇవ్వాలని కార్పొరేటర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సర్వీస్ సెంటర్ నిర్వాహకులు జాల లింగయ్య మాట్లాడుతూ..సైదాబాద్, సంతోష్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఎల్ఐసి పాలసీలు చేయకపోతే వెంటనే తమ వద్దకు వచ్చి నూతన పాలసీలు తీసుకుని తమ భవిష్యత్తుకు భరోసా పొందాలని సూచించారు. ఒకవేళ ఇప్పటికే పాలసీ చేసిన వారైనా సరే కొత్త పాలసీ తీసుకోవడం ద్వారా అనేక బెన్ఫిట్స్ ఉన్నాయని వివరించారు.
కొత్త పాలసీ కోసం సంప్రదించాలనుకునేవారు 9246532085 నెంబరుకు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి భాగ్యనగర్ జిల్లా వైస్ ప్రసిడెంట్ మధుకర్ రెడ్డి, సీనియర్ బిజెపి నేత జంగయ్య, కాలనీ ప్రసిడెంట్ దశరథ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బుచ్చయ్య యాదవ్, అశోక్ గౌడ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.