భారత్ లో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. దాంతో ప్రజలు నెమ్మదిగా భయ విముక్తులు అవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 1233 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,23,215కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,704 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1876 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,24,87,410కు చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,83,82,41,743 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసినట్టు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో 26,34,080 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక కరోనా పాజిటివిటి రేటు విషయానికి వస్తే 87.76 శాతంగా ఉంది. తాజాగా 31 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,21,101కి చేరింది.